Computer & Chenetha

కంప్యూటర్‌ శాస్త్రవేత్త ఛార్లెస్‌ బ్యాబేజ్‌ మగ్గాలలో వాడే పంచ్‌కార్డుల విధానం కంప్యూటర్లలో ఇన్‌ఫుట్‌ - అవుట్‌ఫుట్‌లకు అన్వయించవచ్చునని కార్డులలో వేర్వేరు స్థానాలలో రంధ్రాలను చేయడం ద్వారా వాటి మీద డేటాను స్టోర్‌ చేయవచ్చునని గ్రహించడంతో తాను రూపొందిస్తున్న ఎనలైటికల్‌ ఇంజన్‌ అనే కంప్యూటర్‌లో ఈ విధానాన్ని అనుసరించి విజయం సాధించాడు. బ్యాబేజ్‌ డిజైన్‌ను మెరుగుపర్చి కంప్యూటర్‌ను రూపొందించిన హెర్మన్‌ అనే మరో శాస్త్రవేత్త కూడా ఇన్‌ఫుట్‌ - అవుట్‌ఫుట్‌లకి పంచ్‌కార్డుల సిస్టమ్‌ను వాడి ఆ పద్ధతిని ఇనుమడింపచేశాడు. కంప్యూటర్‌ రంగంలో డేటా ప్రాసెసింగ్‌ అనే ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు. సైన్స్‌ అభివృద్ధి చెందుతున్న కొలదీ దానిలో పలు మార్పులు చోటుచేసుకొని మన దైనందిన జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకుంది
 
Venkatagiri Sarees | by TJR ©2011