మగ్గాలలో కొత్త ఒరవడి - జాకార్డ్‌ విధానం


17వ శతాబ్దం మధ్యంలో ఫ్రాన్స్‌  కు చెందిన జాక్విస్‌ అనే నేత కార్మికుడు మగ్గానికి దారాలను అందించడానికి దీర్ఘచత్రుసాకారంలో వుండే ఒక కార్డుకి రంధ్రాలు చేసి ఉపయోగించాడు. (మన నేత కార్మికులు డాబీని ఉపయోగించి హాసు ద్వారా డిజైన్‌ నేసినట్లు) దీని ద్వారా బట్టపై డిజైన్లు నేయడం సాధ్యమైంది. ఈ కార్డులో కొన్ని లోపాలు వున్నా వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆ పద్ధతినే అనుసరించారు. 
18వ శతాబ్దం ప్రారంభంలో జాకార్డ్‌ అనే నేత కార్మికుడు జాక్విస్‌ తయారు చేసిన కార్డులోని లోపాలను సరిచేసి వేర్వేరు డిజైన్లలో కార్డులను బట్టల తయారులో ఉపయోగించాడు. శాస్త్రీయ మగ్గాల కన్నా జాకార్డ్‌ తయారుచేసిన మగ్గం మెరుగైన ఫలితాలివ్వడంతో చేనేత రంగంలో ఒక ప్రకంపనం సృష్టించబడింది. జాకార్డ్‌ మగ్గాన్ని ప్యారిస్‌లో ఒక పారిశ్రామిక ప్రదర్శనలో ప్రదర్శించబడింది.
జాకార్డ్‌ వినియోగం వలన తమ జీవనోపాధి కోల్పోతామని నేత కార్మికులు ప్రదర్శనలో వున్న జాకార్డ్‌ మగ్గాలన్నీ 
తగులబెట్టారు. కాలక్రమేణా జాకార్డ్‌ మగ్గాలకు ఆదరణ పెరిగింది. అతని పేరే ఆ మగ్గాలకు స్థిరపడింది.



 
Venkatagiri Sarees | by TJR ©2011